బెయిల్‌పై విడుదలైన మాజీ ఛైర్మన్ అరెస్ట్

గుంటూరు: జిల్లా జైలు వద్ద బుధవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెయిల్‌పై విడుదలైన మాచర్ల మాజీ మున్సిపల్ ఛైర్మన్ కిషోర్‌ను మరో కేసులో పోలీసులు తిరిగి అరెస్ట్ చేశారు. దీన్ని కుటుంబ సభ్యులు తప్పుబట్టారు. కిషోర్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు, కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. అతన్ని రెంటచింతల PSకు తరలించారు.