RDT కోసం 20 వేల పోస్ట్‌కార్డుల అందజేత
ATP: ఆర్డీటీ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమానికి పోలేపల్లి వసంత అండగా నిలిచారు. శుక్రవారం కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో రంగయ్యను కలిసి 20 వేల పోస్ట్‌కార్డులను విరాళంగా అందజేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థను కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.