మావోయిస్టు నేతకు కన్నీటి వీడ్కోలు..
కామారెడ్డి జిల్లా ఇస్రోజివాడి గ్రామానికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ నేత, బ్యూరో ఇంఛార్జి కార్యదర్శి పడ్కల్ స్వామి అలియాస్ ప్రభాకర్ అలియాస్ లోకేటి చందర్ రావుకు విప్లవ ప్రజానీకం కన్నీటి వీడ్కోలు పలికారు. ఈనెల 6న గడ్చిరోలిలో జరిగిన ఎన్ కౌంటర్‌లో మృతిచెందారు. ముప్పై ఏళ్లకు పైగా విప్లవోద్యమంలో పనిచేసినట్లు పలువురు వ్యక్తులు పేర్కొన్నారు.