శాంతి మార్గాన్ని అలవర్చుకోవాలి: మాజీమంత్రి

MBNR: ప్రతిఒక్కరూ శాంతిమార్గం అలవర్చుకోవాలని మాజీమంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం జడ్చర్‌లలో బ్రహ్మకుమారీస్ రాజాయోగకేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక సోదరీ దినోత్సవంలో మాజీమంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రపంచశాంతిని కోరుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని మాజీ మంత్రి ప్రారంభించారు.