భారీ వర్షానికి కూలిన ఇల్లు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన చంద్రమ్మ ఇల్లు గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకుడు అంబటి రాజు కూలిన ఇంటిని మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆమెకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.