బీసీ బాలుర వసతి గృహంలో వైద్య శిబిరం

KMR: కామారెడ్డి పట్టణ పరిధిలోని బీసీ బాలుర వసతి గృహంలో బుధవారం వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆర్‌బిఎస్‌కే మెడికల్ ఆఫీసర్ డా.సంతోష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అవసరం మేరకు రక్త నమూనాలను సేకరించినట్లు వెల్లడించారు. ఆరోగ్య, వసతి గృహ సిబ్బంది పాల్గొన్నారు.