పేకాట రాయుళ్ల అరెస్ట్

ADB: పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ ఎస్సై ముజాహిద్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు సోమవారం బంగారుగూడ డంపింగ్ యార్డ్ సమీపంలో దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న ఆదిలాబాద్ పట్టణానికి చెందిన సయ్యద్ అఖ్తర్, లతీఫ్ అహ్మద్, షేక్ రవూఫ్, జన్నును అరెస్టు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వారి వద్ద నుంచి రూ. 20,220 నగదు స్వాధీనం చేసుకున్నారు.