ఈ నెల 8న జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

ఈ నెల 8న జిల్లాస్థాయి హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు

KRNL: ఈ నెల 8న కర్నూలులోని బి. క్యాంప్ క్రీడా మైదానంలో బాల బాలికలకు హ్యాండ్ బాల్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హ్యాండ్ బాల్ సంఘం జిల్లా కార్యదర్శి పి. సువర్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి 2015 మధ్యలో జన్మించిన బాల బాలికలు పోటీలకు అర్హులన్నారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 14న డోన్లో రాష్ట్ర హ్యాండ్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.