జిల్లాలో ఆ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం
రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా పంచాయతీలో సర్పంచ్‌గా జవహర్ లాల్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీలకతీతంగా గ్రామ ప్రజలు ఏకమై ఆయనను ఎన్నుకున్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో తన వంతు కృషి చేస్తానని సర్పంచ్ జవహర్ లాల్ నాయక్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి ఏకగ్రీవ పంచాయతీగా రూప్లా నాయక్ తండా నిలిచింది.