భక్తిశ్రద్ధలతో బోనాలు.. ఐక్యతగా పాల్గొన్న గ్రామస్తులు

RR: షాద్‌నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం సంతాపూర్ గ్రామంలో గురువారం బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించారు. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత అని పలువురు గ్రామస్తులు పేర్కొన్నారు. గ్రామంలో అన్ని వర్గాలు కలిసిమెలిసి ఐక్యతగా పాల్గొని వేడుకలను నిర్వహించడంతో మరింత విశిష్టత సంతరించుకుంది.