ముదిరాజ్ సంఘ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే పాయల్

ADB: ముదిరాజ్ లు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించి వారి అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం పట్టణ ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి ముదిరాజులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పట్టణంలో సంఘ భవన నిర్మాణం, భీమన్న దేవాలయం అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.