రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ADB: నేరడిగొండ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బోథ్ మండలం నక్కలవాడకు చెందిన మోహన్ పెళ్లి పత్రికలను పంచడానికి వెళ్తున్నప్పుడు బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.