పలాసలో డెడ్ బాడీ కలకలం

పలాసలో డెడ్ బాడీ కలకలం

SKLM: పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పెంటిభద్ర గ్రామ సమీప రహదారి వద్ద సోమవారం గుర్తుతెలియని మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.