కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం: పట్టాభి

కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం: పట్టాభి

AP: మైనింగ్ కుంభకోణంలో గాలి జనార్దన్ రెడ్డికి పట్టిన గతే జగన్‌కు పట్టడం ఖాయమని టీడీపీ నేత పట్టాభిరామ్‌ అన్నారు. గాలిజనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని జగన్ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఏఆర్ఈ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై బురద చల్లుతున్నారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ రేట్లు పెంచారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.