దేశంలో ఎంత మంది EMIలు కడుతున్నారంటే?
దేశంలో EMIలు, ఏదో ఒక రకం రుణం కింద ఈఎంఐ చెల్లిస్తున్న వారి సంఖ్య 28.3 కోట్లు. అంటే, దేశంలోని ప్రతి ఐదుగురిలో దాదాపు ఒకరు అప్పుల ఊబిలో ఉన్నారన్న మాట. 2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా అప్పులు చెల్లిస్తున్న వారి సంఖ్య 12.8 కోట్లు ఉండగా, 2024-25 నాటికి 28.3 కోట్లకు చేరింది. ఒక వ్యక్తి ఎన్ని రుణాలు తీసుకున్నా, అతన్ని ఒక్కరిగానే పరిగణించి ఈ లెక్కలు రూపొందించారు.