VIDEO: అకస్మాత్తుగా లారీలో చెలరేగిన మంటలు
VKB: తాండూరు పట్టణంలోని విలియమున్ చౌరస్తా సమీపంలో నిలిపి ఉంచిన ఓ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానిక కౌన్సిలర్ ఇర్షాద్ సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.