వెస్టిండీస్‌పై కేన్ విలియమ్సన్ రికార్డు
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. వెస్టిండీస్, కివీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులు చేసి కేన్ ఔటయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌పై టెస్టుల్లో 1000 రన్స్ పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా కేన్(1022) రికార్డుకెక్కాడు. కేన్‌కు ముందు రాస్ టేలర్(1136) ఈ ఘనత సాధించాడు.