అధ్వానంగా రహదారులు.. అవస్థల్లో గిరిజనులు
SKLM: మెలియాపుట్టి మండలంలో పలు రహదారులు ఐటీడీఏ ద్వారా మంజూరైనాయి. అయితే ఆ రహదారులు నేటికీ రాళ్లు తేలి అస్తవ్యస్తంగా మారాయి. దీంతో మండలంలోని సవరకుద్దబ, నేల బొంతు ఇతర గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. రానున్నది వర్షాకాలం కావడంతో గ్రామాలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లడానికి కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరారు