ఇద్దరి ప్రాణాలు పోయాయ్.. న్యాయం ఎక్కడ సారూ..!
MBNR: కోయిలకొండ మండలంలో దమయపల్లి వద్ద బైకును కారు ఢీకొన్న ఘటనలో బైకుపై వెళ్తున్న తల్లి ముత్యాలమ్మ (55), కొడుకు బలరాం (35) మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, స్థానిక ప్రజలందరూ కలిసి రోడ్డుపై ధర్నా చేపట్టారు. ఇద్దరి ప్రాణాలు పోవడానికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.