మే 10న జాతీయ లోక్ అదాలత్

SKLM: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 10న జిల్లా స్థాయిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనునట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జూనైద్ అహ్మద్ మౌలానా తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న పౌరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.