వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్సీ భరత్

వైసీపీ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు: ఎమ్మెల్సీ భరత్

చిత్తూరు: కుప్పం మండలంలోని మల్లానూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో శనివారం ఎమ్మెల్సీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబును ఎమ్మెల్యేగా గెలిపించినా, ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. వైసీపీ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు.