సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమం
ELR: జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో గురువారం సమాచార హక్కు చట్టంపై అవగాహన, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో ఎంవీ రమణ మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ చట్టం సామాన్యుడి చేతిలో వజ్రాయుధం అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, ప్రజలు పాల్గొన్నారు.