బిడ్డల పేర్ల నమోదు కోసం చివరి అవకాశం
VSP: 15 ఏళ్లు దాటిన బిడ్డల పేర్లు ఇంకా జనన రిజిస్టర్లో నమోదు చేయించుకోకపోతే వెంటనే చేయించుకోవాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జనవరి 21 వరకు మాత్రమే అవకాశం ఉందన్నారు. అనంతరం ఈ సౌకర్యం ఉండదని తెలిపారు. నగర ప్రజలు జోనల్ కార్యాలయాలను సందర్శించి, తగిన పత్రాలను సమర్పించడం ద్వారా బిడ్డ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.