12న సంతనూతలపాడులో ప్రజావేదిక

12న సంతనూతలపాడులో ప్రజావేదిక

ప్రకాశం: సంతనూతలపాడు మండల పరిషత్ కార్యాలయంలో శనివారం జాతీయ ఉపాధి హామీ పథకంఫై సామాజిక ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సురేశ్ బాబు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ బృందం ఆయా గ్రామాల వారీగా తనిఖీలు చేసి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.