ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్ ఘటల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాస్గంజ్‌ నుంచి రాజస్థాన్‌లోని గోగామేడి ప్రాంతానికి గోగాజీ భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 43 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.