కొడంగల్లో చిరుతపులి సంచారం
VKB: కొడంగల్ మండలంలోని ఇందనూర్, రావులపల్లి గ్రామాల శివార్లలో చిరుతపులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు భయపడుతున్నారు. సోమవారం గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సవిత, ఫరూక్ అలీ, రవి ఘటనా స్థలానికి చేరుకుని ఆనవాళ్లను పరిశీలించారు. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.