VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి

VIDEO: బైక్‌ను ఢీ కొట్టిన లారీ ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి

HNK: ఐనవోలు మండలం చింతకుంట క్రాస్ రోడ్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ పై వెళ్తున్న వ్యక్తులను లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి, మరో వ్యక్తి గాయపడ్డాడు. పున్నెల గ్రామానికి చెందిన చాట్ల వీరస్వామి తన బంధువుతో బైక్‌పై పర్వతగిరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.