ఐఎంఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన ఎమ్మెల్యే
NTR: జీ.కొండూరు మండలంలోని కుంటముక్కలలో ఐ.ఎం.ఎల్ పాలీ కంటైనర్స్ ఫ్యాక్టరీని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం ప్రారంభించారు. వివిధ పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు ఈ ప్లాస్టిక్ కంటైనర్లను వినియోగించనున్నారు. అనంతరం ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కృష్ణ యూనియన్ మిల్క్ ఛైర్మన్ ఆంజనేయులు పాల్గొన్నారు.