బచ్చోడులో ఉద్రిక్తత.. సర్పంచ్ అభ్యర్థి బైక్ దగ్ధం
KMM: తిరుమలాయపాలెం మండలం బచ్చోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నందిపాటి మల్లికార్జున్ ఇంటి ముందు పార్క్ చేసిన తన బైకును గుర్తుతెలియని దుండగులు అర్ధరాత్రి తగలబెట్టారు. ఈ ఘటనతో ఆదివారం గ్రామంలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అభ్యర్థి కోరారు.