వనపర్తిలో రేపు ఉద్యోగ మేళా!

WNP: జిల్లాలోని పీఎంకేకే కేంద్రంలో రేపు ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కాల్పనాధికారి జానీపాషా తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో రేపు ఉదయం 10గంటలకు ఈమేళాను నిర్వహిస్తున్నామన్నారు. పది, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు.