ఎడ్ల పందేలను ప్రారంభించిన ఎమ్మెల్యే

SRPT: కోదాడ మండల పరిధిలోని నల్లబండ గూడెంలో లింగమంతుల జాతరలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయస్తాయి ఎడ్ల పందేలను కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల్లో పశువుల పెంపకంపై ఆసక్తిని పెంచేందుకు పోటీలు ఎంతో దోహదపడతాయి అన్నారు. ఎడ్ల పందాలు తెలంగాణ సంస్కృతి అని కొనియాడారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.