మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్

మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్

W.G: మంత్రి నారా లోకేశ్‌ను సోమవారం విజయవాడలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనుల గురించి, రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రికి నాయకర్ వివరించారు. ముఖ్యంగా నరసాపురం నియోజకవర్గ మౌలిక సదుపాయాల కల్పన, పుష్కరాల కోసం ఘాట్ల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులపై చర్చించారు.