VIDEO: పండగ వేళ విషాదం
VSP: కుర్మాణపల్లెం సమీపంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది.పెదగంట్యాడ మండలానికి చెందిన వియ్యుపు ఉమాదేవి (22) తన భర్త పైదీరాజుతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీనితో ఆమె బస్సు చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. పెళ్లైన ఏడాదికే భర్త కళ్ళ ముందే భార్య మరణించడంతో విషాదం చోటుచేసుకుంది.