రేపు కళ్యాణ వెంకన్న ఆలయంలో ఉగాది ఆస్థానం
CTR: పుంగనూరు పట్టణంలోని శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో గురువారం ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు అర్చకలు ఇవాళ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం పూర్వం శ్రీవారిని సుప్రభాత సేవతో మేలుకొల్పి అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తర్వాత శ్రీవారి దర్శన భాగ్యం కల్పించనున్నట్లు తెలిపారు.