SARDS సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్ శిక్షణ

ప్రకాశం: యర్రగొండపాలెం మండలంలో మంగళవారం SARDS సంస్థ ఆధ్వర్యంలో యూత్‌కు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందిస్తున్నామని ప్రోగ్రాం మేనేజర్ మహాలక్ష్మి తెలియజేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రతి జాబ్‌కు కంప్యూటర్ శిక్షణ అనేది చాలా ముఖ్యమన్నారు. కావున యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.