నేడు ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
KRNL: కర్నూలులోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని సమావేశ భవనంలో ఇవాళ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. కాలనీలలోని మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధి వెలుగులు, పరిశుభ్రతపై ప్రజలు తమ ఫిర్యాదులను లిఖిత పూర్వకంగా సమర్పించవచ్చని సూచించారు.