వైసీపీని తీవ్రంగా విమర్శించిన నేతలు
నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర రెడ్డి, గీతా జయసూర్యలతో కలిసి వైసీపీని తీవ్రంగా విమర్శించారు. వెలుగోడు, అలగనూరు తదితర ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాయలసీమ లిఫ్ట్ కోసం ఇప్పటికే భారీగా నిధులు మంజూరు చేశామని తెలిపారు.