'మాదకద్రవ్యాల నిర్మూలనకు తనిఖీలు చేస్తున్నాం'
W.G: జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు 'ఆపరేషన్ వజ్రప్రహార్' ప్రారంభమైంది. దీనిలో భాగంగా జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో విస్తృత సోదాలు చేస్తున్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని పోలీసులు తెలిపారు. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి. విశ్వనాథ్‌ల నేతృత్వంలో తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.