కలవచర్లలో పల్లె నిద్ర నిర్వహించిన ఎస్ఐ

కలవచర్లలో పల్లె నిద్ర నిర్వహించిన ఎస్ఐ

VZM:  గుర్ల ఎస్ఐ నారాయణరావు ఆదివారం రాత్రి స్దానిక కలవచర్ల గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడుతూ... సైబర్‌ నేరాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ మహిళల భద్రత, ట్రాఫిక్‌ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అజ్ఞాత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.