'ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి'

'ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి'

NGKL: జిల్లాలో నేటి నుంచి ప్రారంభమయ్యే ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులను కలెక్టర్ బధావత్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. జూన్ 12 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని, ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.