'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

'పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం'

MNCL: పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రేమ్‌చంద్, వైస్ ఛైర్మన్ ఎండి.ఆరిఫ్ అన్నారు. ఇవాళ లక్షెట్టిపేటలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ దిలీప్, నాయకులు రాజు పాల్గొన్నారు.