ఆన్‌లైన్ డెలవరీ ప్రాంచైజీల పేరిట మోసం
TG: ఈ-కామ్ డెలివరీ పేరిట డల్లాస్ ఈ-కామ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఘరానా మోసం వెలుగు చూసింది. ఈ-కామర్స్ డెలవరీ కంపెనీ ఫ్రాంచైజీ పేరిట ఓ ముఠా దేశవ్యాప్తంగా 2వేల మంది నుంచి రూ.వందల కోట్ల వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాష్ట్రంలో 30 మంది నుంచి రూ.2.5 కోట్లు దోచేశారు. ఫ్రాంచైజీల పేరిట ఒక్కరి నుంచి రూ.1.5 - 32.5 లక్షల వరకు వసూలు చేశారు.