"యూరియాపై ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుంది"

VZM: రాష్ట్రరైతాంగం యూరియా కోసం పడుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్సీ శాసన మండల ప్రతిపక్ష నేత బొత్స గరివిడి పార్టీ కార్యాలయంలో చీపురుపల్లి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం రైతులతో ఆడుకుంటుందని, కనీసం పట్టిచుకోవడంలేదని, దీనిపై తొమ్మిదో తారీఖు నాడు కార్యకర్తలు రైతులతో ధర్నా చేపట్టినట్లు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలిచేలా పనిచేయాలని బోత్స సూచించారు.