VIDEO: మురుగు కాలువకు మరమ్మత్తులు చేపట్టాలి

VIDEO: మురుగు కాలువకు మరమ్మత్తులు చేపట్టాలి

BNR: భువనగిరిలోని అర్బన్ కాలనీ ఫేస్ 2లో మురుగు కాలువ సమస్య పట్టిపీడిస్తుంది. ఏళ్లు తరబడిన ఈ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతో సుమారు 100 ఇళ్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాలనీవాసులు అంటున్నారు. ప్రస్తుత కాలువ అడుగుభాగం శిథిలావస్థకు చేరుకుంది. మురుగునీరు పారకుండా కాలువలో నిలిచి దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ మురుగు కాలువకు మరమత్తులు చేయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.