నీటి సంరక్షణలో సాగునీటి సంఘాల కీలక పాత్ర: కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తి మండలం బీడుపల్లిలో సోమవారం నిర్వహించిన ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం అధికార వికేంద్రీకరణకు నిదర్శనమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి పాల్గొన్నారు.