ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్ పోస్ట్ ఏర్పాటు
WGL: వర్ధన్నపేట మండలం ఉప్పెరపల్లి క్రాస్ రోడ్డులో పోలీసులు శనివారం చెకోపోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఏసీపీ అంబటి నరసయ్య తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించడానికి సిబ్బందికి వాహన వివరాలు నమోదు చేసుకోవాలని, అనుమతిపత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.