విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

విద్యుత్ షాక్‌తో గొర్రెల కాపరి మృతి

MDK: చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామానికి చెందిన క్యాసారం దాసు(32) విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. చందంపేట గ్రామ శివారులో గురువారం గొర్రెలు మేపడానికి వెల్లిన దాసు దాహం తీర్చుకునేందుకు బోరు స్టార్ట్ చెయ్యబోగా కరెంట్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.