షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు ప్రభుత్వం భారీ నజరానా
TG: షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ధనుష్ ఇటీవల షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించగా.. రూ. కోటి 20 లక్షలు బహుమతిగా ఇస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. కాగా, ధనుష్ ఇప్పటికే 10 మీ. ఎయిర్‌రైఫిల్ వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లోనూ స్వర్ణాలు సొంతం చేసుకున్నాడు.