చక్రాయపేట మండల రైతులకు శుభవార్త

చక్రాయపేట మండల రైతులకు శుభవార్త

KDP: చక్రాయపేట మండల రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. 'అన్నదాత సుఖీభవ' పథకం లబ్ధిదారుల జాబితాలు గ్రామ సచివాలయాలకు చేరాయని మండల వ్యవసాయ అధికారి నవంత్ బాబు తెలిపారు. అర్హులైన రైతుల జాబితాను పరిశీలించి వ్యవసాయాధికారి తమ లాగిన్‌లో అప్రూవల్ చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ. 20,000 ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు.