ముగిసిన రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు
CTR: రంజాన్ మాసంలోని చివరి శుక్రవారం సందర్భంగా పుంగనూరులోని మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. నెల రోజులపాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో పలు మసీదుల వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా ముస్లిం మత గురువులు ఖురాన్ గొప్పతనం, రంజాన్ సందేశాన్ని వినిపించారు.